HUZURABAD RESULTS : వరుసగా మూడో రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యం…!

-

మూడో రౌండ్ లోనూ బీజేపీ లీడ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. మొదటి రెండు రౌండ్ లలో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. హుజురాబాద్ కు సంబంధించిన మూడవ రౌండ్ రిపోర్టులో కూడా బిజెపి లీడ్ లో ఉన్నట్టు సమాచారం అందుతోంది.

మూడో రౌండ్ లో బిజెపి 911 ఓట్ల లీడ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు మూడు రౌండ్ ల రిపోర్టులు రాగా ఇంకా 19 రౌండ్ ల రిపోర్టులు రావాల్సి ఉంది. మొత్తం ఇరవై రెండు రౌండ్లు ఉండగా మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇక మొదటి రౌండ్ లో బిజెపి కి 166 ఓట్ల ఆధిక్యం వచ్చింది. అదే విధంగా రెండో రౌండ్ లో బిజెపి స్వల్ప మెజారిటీ 193 కాగా మూడో రౌండ్ లో బిజేపికి మెజారిటీ ఎక్కువే వచ్చింది. దాంతో బిజెపి నాయకులు గెలుపు పక్కా అని అంచనా వేస్తున్నారు.

 

 

.

Read more RELATED
Recommended to you

Exit mobile version