హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైం ఏసీపీ ఇంట తీవ్ర‌విషాదం..కుటుంబంలో ముగ్గురు మృతి..!

-

హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైం ఏసీపీ ఇంట తీవ్ర‌విషాదం చోటు చేసుకుంది. ఏసీపీ కుటుంబ స‌భ్యులు ప్ర‌యాణిస్తున్న కారుకు మేడ్చెల్ జిల్లా కీస‌ర మండ‌లం యాద్గార్ ప‌ల్లి ఔట‌ర్ రింగ్ రోడ్డు వ‌ద్ద రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ప్ర‌కాశం జిల్లాలో జ‌రుగుతున్న ఓ వివాహ వేడుక కోసం వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

కారు వేగంగా వెళ్లి డివైడ‌ర్ ను ఢీ కోట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఏసీపీ కుటుంబంలో ముగ్గురు మృతి చెంద‌గా మ‌రొక‌రికి గాయాల‌య్యాయి. ప్ర‌మాదంలో ఏసీపీ భార్య శంక‌ర‌మ్మ మరియు ఏసీపీ త‌మ్మ‌డి కుమారుడు కోడ‌లు ఉన్నారు. ఇక ఏసీపీ సోద‌రుడు బాల‌కృష్ణ‌కు గాయాలు అవ్వ‌డంతో ఆయ‌న్ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version