రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.. హోం క్వారంటైన్ లోనే ఉన్నాముగా మాకు తగ్గిపోయింది అనేసి బయట తిరిగితే ఇక అంతే సంగతులు డైరెక్ట్ గా లోపలేస్తారు. హోం క్వారంటైన్ లో ఉండి నియమాలను ఉల్లంఘిస్తూ బయట తిరుగుతే వారి పై కేసు నమోదు చేస్తామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. ఈ మధ్య ఇలా హోం క్వారంటైన్ లో ఉన్న వాళ్ళు బయట తిరుగుతున్నారని ఆయన దృష్టికి వచ్చినట్టుగా ఆయన అన్నారు.
కరోనా మహమ్మారి బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురైన వారు మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. లక్షణాలు లేకున్నా కొవిడ్ పాజిటివ్ వచ్చినవారు, స్వల్ప లక్షణాలు ఉన్నవారిని వైద్యులు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. నిబంధనల ప్రకారం.. వైద్యులు సూచించినట్లుగా హోం క్వారంటైన్‌లో ఉండేవారు కచ్చితంగా 14 రోజుల పాటు ఇంటి నుంచి బయటకు రాకూడదు. ఇంట్లో కుటుంబ సభ్యులైనా దూరంగానే ఉండాలి. కొంతమంది మాత్రం ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడ తిరుగుతున్నారని వ్యాధి ను ఎక్కువగా సంక్రమించేందుకు కారణం అవుతున్నారని ఆయన అన్నారు. అటువంటి వారి పై ఎక్కువగా దృష్టి పెట్టాలని హోం క్వారంటైన్ లో ఉన్న ప్రతీ ఒక్కరి పై స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఆయన పోలీసులకు సూచించారు. జాగ్రత్తగా ఉండండి సమాజాన్ని కూడా జాగ్రత్తగా ఉంచండి అంటూ ఆయన స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.