ఏపీ లో కరోనా మహమ్మారి కలకలం రేపింది. ఓ ప్రభుత్వ కార్యాలయం లో ఏకంగా 33 మంది ఉద్యోగులకి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే… గుంటూరు జిల్లా అమరావతి రోడ్డులో ఉన్న ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో టెస్టులు నిర్వహించగా ఒకేరోజు 33 మంది ఉద్యోగులకి కరోనా అని తేలింది.
ఆ కార్యాలయం డైరెక్టర్ కు కరోనా లక్షణాలు ఉండటంతో వైద్యుల సూచన మేరకు టేస్ట్ నిర్వహించారు, టెస్ట్ లో పాజిటివ్ రావడంతో కార్యాలయంలో ఉన్న 120 సిబ్బందికి టెస్ట్ లు నిర్వహించగా అందులో 33 మందికి కరోనా పాజిటివ్ గా వెల్లడయ్యింది. దాంతో వారంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వారిని వెంటనే ప్రభుత్వ ఇసోలేషన్ సెంటర్ కు తరలించి మిగితా ఉద్యోగులను హోం క్వారంటైన్ లో ఉండమని వైద్యులు సూచించారు. ఆ కార్యాలయాన్ని స్యానిటైజ్ చేసి కొన్ని రోజుల వరకు మూసివేశారు. ఈ ఘటన స్థానికంగా పెను దుమారం రేపుతుంది.