హైదరాబాద్ భూములపై ముదుపర్ల కన్ను… ధర ఎంతైనా “సై” !

-

తెలంగాణ రాజధాని హైదరాబాద్ అన్ని రకాలుగా ఎంత అనువైనది అన్నది తెలిసిందే. చుట్టుపక్కల చిన్న చిన్న పట్టణాలలో నివసించే వారు కానీ, లేదా పల్లెటూరులో నివసించే వారు కావొచ్చు అందరూ హైదరాబాద్ కు వెళ్ళిపోయి హ్యాపీ లైఫ్ ను లీడ్ చెయ్యాలి అని కోరుకుంటున్నారు. అంతెందుకు ఇతర రాష్ట్రంగా వారు కూడా హైదరాబాద్ కు రావడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ అంటే ఉద్యోగాలకు నెలవు అనుకున్నాము.. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఎంతగా డెవలప్ అయిందన్నది ఊహించలేము. ఒక మనిషి హ్యాపీ గా జీవించడానికి అవసరం అయిన అన్ని వనరులు సమృద్ధిగా ఉన్నాయి. అందుకే హైదరాబాద్ భూములపై పెట్టుబడులు పెట్టడానికి చూస్తున్నారు. హైదరాబాద్ లో భూములను సొంతం చేసుకోవడానికి దేశ విదేశాల నుండి కూడా ముదుపర్లు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా మేడ్చల్, షామీర్ పెట్ మరియు కొంపల్లి ఏరియాలలో భూములు ధర ఇంతని డిస్కస్ చేయకుండా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇక రానున్న పది సంవత్సరాలలో ఇక్కడి భూముల ధరలు అయిదు రేట్లు పెరుగుతాయని జాతీయ పత్రికలు చెబుతుండడం ఇప్పుడు సంచలనంగా మారింది. అందుకే ఈ ప్రాంతాలలో భూములపై పెట్టుబడులు పెట్టడానికి ఎగబడి వస్తున్నారు. ఒకసారి ఈ భూములపై పెట్టుబడిని పెట్టేసి కొంతకాలం ఓపికగా ఉంటే చాలు ఊహించని విధంగా లాభాలను సొంతం చేసుకోవచ్చని కొల్లీర్స్ ఇండియా ఒక నివేదికలో తెలిపింది.

ఇక ఇదే విధంగా మహారాష్ట్ర లోని నేరల్ – మాథెరన్, గుజరాత్‌లోని సనంద్‌-నల్సరోవర్‌, చెన్నై సమీపంలోని ఈసీఆర్‌-ఇంజాబక్కమ్‌-కోవళం, కోల్‌కతా దగ్గర్లోని న్యూ టౌన్‌-రాజర్‌హట్‌ లాంటి ప్రాంతాలలోనూ హైదరాబాద్ లాగా భూములకు రానున్న అయిదు సంవత్సరాలలో భారీగా ఆదాయం వస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ముదుపరులు ముందుగా భూములను కొనసానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. దీని తర్వాతనే.. ఇండ్లు, ప్లాట్లు, వీకెండ్ హోమ్స్, హాలిడే హోమ్స్, రిటైర్మెంట్ హోమ్స్ ద్వారా లభించే ఆదాయాన్ని పెంచుకోవడానికి మొగ్గు చూపుతున్నారట. మరి ఇంత క్లారిటీ గా జాతీయ పత్రికలు చెబుతున్నారంటే… ఇక ముదుపర్లు పైన మనము తెలిపిన ఏరియాలలో భూములను కొనుగోలు చేయడానికి ఇక పోటీ పడుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version