ఢిల్లీ తరువాత హైదరాబాద్ మెట్రోనే.. ఎండీ కీలక ప్రకటన

-

హైదరాబాద్ మెట్రో రైళ్ళలో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. దేశంలో అన్ని మెట్రోల్లో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ మెట్రో ట్రైన్ లలోనే ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇండియన్ మెట్రో ఆపరేటర్స్ గ్రూప్ చేసిన ఒక సర్వే ఆధారంగా శనివారం, అంటే నిన్న పలు రాష్ట్రాల్లో ప్రయాణికుల సంఖ్యలో హైదరాబాద్ లో రెండో స్థానంలో నిలిచిందని అయన పేర్కొన్నారు.

389 కిలోమీటర్లు, 285 స్టేషన్లు గల ఢిల్లీ మెట్రో రైలులో 14 లక్షల 79 వేల 300 మంది ప్రయాణించారని అలానే 69 కిలోమీటర్లు, 57 స్టేషన్లు గల హైదరాబాద్ మెట్రో లో లక్ష 33 వేల 974 మంది ప్రయాణించారని ఆయన అన్నారు. ఇక 45 కిలోమీటర్లు, 32 స్టేషన్లు గల చెన్నై మెట్రోలో 29 వేల 141 మంది ప్రయాణించారని పేర్కొన్నారు. ఇక 42 కిలోమీటర్లు, 40 స్టేషన్లు గల బెంగళూరు మెట్రోలో 68 వేల 716 మంది మాత్రమే ప్రయాణించారని ఆయన ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version