గ్రేటర్ పరిధిలో మెట్రో ప్రయాణికులకు యాజమాన్యం శుభవార్త అందించింది. కరోనా వైరస్ నేపథ్యంలో గత మార్చి 22న నిలిచిపోయిన హైదరాబాద్ మెట్రో రైలు సేవలు తిరిగి సెప్టెంబర్ 7, 2020 న ప్రారంభమయ్యాయి. రేపటి నుంచి ఉదయం 6.30 – రాత్రి 9.30 వరకు మెట్రో రైల్ తిప్పనున్నారు. ప్రస్తుతానికి ఉదయం 7.00 – రాత్రి 9.30 వరకు ట్రైన్ తిప్పుతున్నారు. ఒక మూడు స్టేషన్లు కూడా తెరవలేదు. అందుతున్న సమాచారం మేరకు రేపు అంటే 3 డిసెంబర్ 2020 నుండి ఆ 3 క్లోజ్డ్ స్టేషన్లను అంటే కారిడార్ 1లో ఉన్న భరత్ నగర్ మరియు కారిడార్ 2 లోని ముషీరాబాద్ & గాంధీ హాస్పిటల్ స్టేషన్ లను ప్రారంభించనుంది మెట్రో యాజమాన్యం.
ప్రయాణికుల డిమాండ్ ని బట్టి మొదటి రైలు ప్రతిరోజూ 0700 గంటలకు బదులుగా 06: 30 కు ప్రారంభమవుతుంది. అయితే చివరి రైలు సమయములో ఎటువంటి మార్పు లేదు. ఇది రాత్రి 9.30 గంటలకు స్తర్తింగ్ టెర్మినల్ స్టేషన్ నుండి బయలుదేరి రాత్రి 10.30 గంటలకు గమ్యం టెర్మినల్ స్టేషన్ కు చేరుకుంటుంది.