హైదరాబాద్ మెట్రో బంపర్ ఆఫర్.. 50 % క్యాష్ బ్యాక్

-

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఇప్పటికే పలు ఆఫర్లని మెట్రో ప్రవేశ పెట్టగా ఇప్పుడు రేపటి నుంచి మెట్రో ప్రయాణికులకు మరో ఆఫర్ అమల్లోకి రానుంది. హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ గ్రేటర్ లోని ప్రయాణికులు మెట్రో రైల్లలో ప్రయాణాలకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారని అన్నారు. సువర్ణ ఆఫర్ ప్రకటించిన అనంతరం ప్రయాణికుల సంఖ్య 30 శాతం పెరిగిందని ఆయన అన్నారు.

మెట్రో చార్జీల్లో 40 శాతం రాయితీ ఇస్తు గతంలో ఆఫర్ ప్రకటించామని, ఇప్పుడు రోజు సరాసరి లక్ష 30 వేల మంది వరకు ప్రయాణిస్తున్నారని అన్నారు. రేపటి నుంచి మెట్రో ప్రయాణికులకు మరో ఆఫర్ అమల్లోకి రానుంది, రేపటి నుంచి మెట్రో స్మార్ట్ రీచార్జీలపై 50 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నామని అన్నారు. స్టేషన్లలో, ఆన్ లైన్ లో రీచార్జీ చేసుకునే వారికి ఈ ఆఫర్ వర్తించనుందని అయన అన్నారు. అయితే 90 రోజుల్లో ఈ రీచార్జీ మొత్తాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. ఉదాహరణకు 1500 స్మార్ట్ కార్డులో రీచార్జీ చేస్తే 600 క్యాష్ బ్యాక్ తో కలిపి 2100 బ్యాలన్స్ స్మార్ట్ కార్డులో జమ కానుందన్న మాట.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version