జనసాంద్రత విషయంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది.తెలంగాణ స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్ (ATLAS)-2024 ప్రకారం హైదరాబాద్‌లో చదరపు కిలోమీటరుకు 18,161 మంది ప్రజలు నివసిస్తుండగా.. ఢిల్లీలో చదరపు కిలోమీటరుకు 11,313 మంది జనాభా నివసిస్తున్నారు.ఈ రెండింటినీ పోల్చి చూస్తే హైదరాబాద్‌లో జనాభా గణనీయంగా పెరుగుతున్నట్లు తెలుస్తున్నది.
ఇక దేశవ్యాప్తంగా పోలిస్తే జనసాంద్రతలో ముంబై అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక్కడ చదరపు కిలోమీటర్‌కు 28,508 మంది ప్రజలు నివసిస్తున్నారు.ఇక హైదరాబాద్ జనాభా సాంద్రత పెరుగుతున్నప్పటికీ, తెలంగాణలో మాత్రం జనాభా తగ్గుదల నమోదైందని నివేదికలు చెబుతున్నాయి. బిహార్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ మాత్రం జనసాంద్రత చాలా తక్కువగా ఉండటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా ఒక చదరపు కిలో మీటరుకు కేవలం 312 మంది మాత్రమే ఉంటున్నట్లు తెలిసింది.