అల్లూరి జిల్లాలో తాగు నీటి వెతలు.. వేడుకుంటున్న గిరిజనులు

-

ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో రక్షిత తాగునీరు దొరక్క అడవుల్లో నివాసం ఉంటున్న గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతగిరి మండలం కొండశిఖర బూరిగ గ్రామస్తులు తాగు నీటి కోసం కిలో మీటర్ల మేర బిందెలు పట్టుకుని వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమవి తీరని వెతలు అని వాపోతున్నారు. రక్షిత తాగునీటి కోసం RWS పీఓ అధికారితో ఎంత మొర పెట్టుకున్నా తమ బాధ తీరడం లేదని చెబుతున్నారు. అధికారులను అడిగితే ఇదిగో వస్తున్నాం, అదిగో చేసేస్తాం.. అంటున్నారే కానీ, ఆచరణలో లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా తమకు రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news