హీరో మంచు మనోజ్ కారుకు చలాన్ వేసిన హైదరాబాద్ పోలీసులు

-

మెహిదీపట్నం : టాలీవుడ్‌ యంగ్‌ హీరో మంచు మనోజ్ కు హైదరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు షాక్‌ ఇచ్చారు. ఇవాళ ఉదయం నుంచి టోలిచౌకి లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే… సినీ హీరో మంచు మనోజ్ కారుకు 700 రూపాయల చలాన్ వేశారు హైదరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు. అలాగే.. ఆయన కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలిం తొలగించారు పోలీసులు.

మంచు మనోజ్ ఏపీ 39 HY 0319 కారులో ప్రయాణిస్తుండగా టోలిచౌకి ట్రాఫిక్ పోలీసులు ఆపి… అద్దాలకు బ్లాక్ ఫిలిం తొలగించి, చలాన్ విధించారు. కాగా.. గత 10 రోజుల నుంచి హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు.. నగరంలో కఠినంగా రూల్స్‌ అమలు చేస్తున్నారు. కార్లుకున్న బ్లాక్‌ ఫిల్మ్‌లను తొలగిస్తూ.. జరిమానాలను విధిస్తున్నారు ట్రాఫిక్‌ పోలీసులు. ఇటీవల కాలంలో నగరంలో జరుగుతున్న కారు ప్రమాదాల నేపథ్యంలో.. ఈ చర్చలు చేపట్టారు పోలీసులు. ఇందులో భాగంగానే.. నాలుగు రోజుల కిందట సినీ నటుడు అల్లు అర్జున్, కళ్యాణ్‌ రామ్‌లకు కూడా ఫైన్‌ వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version