హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలపై.. మార్గదర్శకాలు విడుదల

-

న్యూ ఇయర్ వేడుకలపై సైబరాబాద్ పోలీసులు మార్గదర్శకాలను విడుదల చేశారు. తెల్లవారుఝామున ఒంటిగంట వరకు పబ్బులకు అనుమతి ఉంటుందని.. ఈవెంట్ కు రెండు రోజుల ముందు పోలీసులు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు పోలీసులు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కోవిడ్ నిబంధనలు తప్పనిసరి చేస్తూ పబ్ లకు గైడ్ లైన్స్ విడుదల చేశారు. పబ్బుల్లో భౌతిక దూరం తప్పనిసరి అని.. మాస్క్ లేని వ్యక్తులకు అనుమతి నిరాకరించాలని పేర్కొన్నారు పోలీసులు.

new year

ఈవెంట్ ఎంట్రీ పాయింట్ వద్ద థర్మల్ స్కానర్ ఏర్పాటు తప్పనిసరి అని.. వాక్సినేషన్ రెండు డోసులు సర్టిఫికెట్ చూపని వ్యక్తులకు అనుమతి నిరాకరించాలని తెలిపారు పోలీసులు. కోవిడ్ ప్రోటోకాల్ నేపథ్యం లో మోతాదుకు మించి పాసులు అమ్మ రాదని.. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించనీ వ్యక్తులకు వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. పబ్లిక్ ఎక్కువగా వచ్చే ఈవెంట్లకు అధిక సిబ్బందిని పెట్టాలని సూచనలు చేశారు పోలీసులు.

ఈవెంట్ నిర్వాహకులు, సిబ్బంది తప్ప్పనిసరిగా 48 గంటల ముందు టెస్ట్ చేయించుకున్న నెగిటివ్ రిపోర్ట్ చూపించాలని.. ప్రతి ఎంట్రీ పాయింట్ వద్ద శానిటైజర్ తప్పనిసరి చేశారు పోలీసులు. ఈవెంట్ కు ముందు మొత్తాన్ని డిస్ఇన్ఫెక్ట్ చేయాలని.. అవుట్ డోర్ ఈవెంట్లలో డీజే నిషేధమని.. మ్యూజికల్ ఈవెంట్ శబ్దం ప్రిన్సెస్ దాటి బయటికి వినపడకూడదన్నారు. శబ్ద కాలుష్యం పై స్థానికులు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తప్పవని.. సౌండ్ లెవెల్ 45 డెసిబుల్స్ ను మించరాదని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version