“దాక్కో దాక్కో మేక” ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది…!

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా పుష్ప. ఈ సినిమా ఇప్పటికే విడుదల కాగా భారీ కలెక్షన్లను రాబడుతోంది. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో పాటలు సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలోని దాక్కో దాక్కో మేక ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు.

తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ పూర్తి పాట రిలీజ్ జేశారు. ఈ పాట అల్లు అర్జున్ సినిమాలో పోలీసులను అడవిలో ఎదిరించిన సమయంలో వస్తుంది. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించారు. అంతే కాకుండా ఈ పాటను శివ తన గొంతుతో పాడారు. దేవిశ్రీప్రసాద్ ఈ పాటకు స్వరాలు సమకూర్చారు. ఈ పాట లిరికల్ వీడియో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. మరి ఫుల్ వీడియో సాంగ్ ఏ రేంజ్ లో వ్యూవ్స్ రాబడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version