పడక గదిలో బాయ్‌ఫ్రెండ్‌తో కూతురు.. కన్న తండ్రి చేసిన పని తెలిస్తే..

-

కుమార్తెను కలవడానికి వచ్చిన బాయ్‌ఫ్రెండ్‌ను ఆమె తండ్రి కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. మృతుడుని అనీశ్ జియోర్జ్‌గా పోలీసులు గుర్తించారు. యువకుడిని హత్య చేసిన సైమన్ లాలూను అరెస్టు చేశారు.

హత్యోదంతం గురించి సైమన్ లాలూనే పోలీసులకు సమాచారం అందించడం గమనార్హం. దొంగతనం కోసం వచ్చాడని పొరపాటుగా భావించి కత్తి పొడిచినట్లు సైమన్ వెల్లడించాడు. అయితే, స్థానిక చర్చిలో అనీశ్, ఆమె స్నేహితురాలు గాయక బృందంలో సభ్యులు.

పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన హత్యగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తమ ఇంటికి అనీశ్ రావచ్చని సైమన్ ముందే అంచనా వేశాడు. తన కూతురు గదిలో అనీశ్ ఉన్నాడని నిర్ధారించుకున్న సైమన్ కత్తితో యువకుడిపై దాడికి పాల్పడ్డాడు. ఆ యువతి గదిలోనే హత్య చేశాడు.

రక్తం ముడుగులో పడి ఉన్న అనీశ్‌ను పోలీసులు మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు తరలించగా అతడు అప్పటికే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అనీశ్ కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version