కాల్​గర్ల్​ కోసం ఆన్​లైన్​లో వెతికి.. సైబర్ కేటుగాళ్ల చేతిలో బుక్కైన టెకీ

-

నెట్టింట కాల్​గర్ల్ కోసం వెతికి చివరకు సైబర్ కేటుగాళ్ల చేతిలో బుక్కయ్యాడు ఓ సాఫ్ట్​వేర్ ఇంజినీర్. వేశ్య కోసం వెతికి లక్షకుపైగా నగదు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ చందానగర్​లో చోటుచేసుకుంది.

చందానగర్‌లో నివాసం ఉండే ఐటీ ఉద్యోగి డిసెంబరు చివరివారంలో ఆన్‌లైన్‌లో కాల్‌గర్ల్‌ కోసం(ఎస్కార్ట్‌ సర్వీస్‌) వెతికాడు. ఓ వెబ్‌సైట్లో కనిపించిన లింకు క్లిక్‌ చేయగానే వాట్సాప్‌ నంబరు దొరికింది. పటేల్‌ చార్మి పేరుతో పరిచయం చేసుకున్న వ్యక్తి వాట్సాప్‌ ద్వారా కొందరు అమ్మాయిల చిత్రాలు పంపాడు. బుకింగ్‌ కోసం రూ.510, తరువాత రూ.5,500,  అనంతరం సెక్యూరిటీ డిపాజిట్‌ కింద రూ.7,800.. ఇలా వేర్వేరు కారణాలు చెబుతూ రూ.1.97 లక్షలు కాజేశాడు. చివరకు మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version