హైదరాబాద్ టు షిరిడీ టూర్ ప్యాకేజీ.. ధర కూడా తక్కువే.. ఈ ప్రదేశాలన్నీ చూడచ్చు..!

-

చాలా మంది షిరిడీ వెళ్తూ వుంటారు. మీరు కూడా షిరిడీ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీరు ఈ టూర్ ప్యాకేజీ ని చూడాల్సిందే. షిరిడీ, శనిశిగ్నాపూర్ ఈ ప్యాకేజీ లో కవర్ అవుతాయి. ఇక ఈ టూర్ ప్యాకేజీ కి సంబంధించి పూర్తి వివరాలని చూసేద్దాం. షిరిడీ, శనిశిగ్నాపూర్ ని ఈ ప్యాకేజీ తో చూసి రావచ్చు. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రతీ బుధవారం హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులో వుంది. ఐఆర్‌సీటీసీ టూరిజం సాయి సన్నిధి పేరుతో అందుబాటులో వుంది.

ట్రైన్ టూర్ ప్యాకేజీ ఏ ఇది. ఈ టూర్ మొదటి రోజు హైదరాబాద్‌లో స్టార్ట్ అవుతుంది. బుధవారం సాయంత్రం 6.50 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అజంతా ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాలి. ఆ తరవాత మూడో రోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ రీచ్ అవుతారు. వేర్వేరు కేటగిరీల్లో ఈ టూర్ ప్యాకేజీ వుంది. రెండో రోజు ఉదయం 7.10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్ రీచ్ అవుతారు. అక్కడ్నుంచి షిరిడీ బయల్దేరాలి. హోటల్ లో చెక్ ఇన్ అయ్యాక ఫ్రెషప్ కావాలి.

ఆ తర్వాత షిరిడీలో సాయిబాబా ఆలయ దర్శనం ఉంటుంది. సొంత ఖర్చులతోనే ఆలయాన్ని దర్శించుకోవాలి. సాయిబాబా దర్శనం పూర్తైన తర్వాత సాయంత్రం 4 గంటలకు శనిశిగ్నాపూర్ వెళ్లాల్సి వుంది. శని ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత నాగర్‌సోల్ స్టార్ట్ అవ్వాలి. రాత్రి 9.20 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌లో రైలు ఎక్కాలి. ఇక ధర వివరాలు చూస్తే.. నలుగురి నుంచి ఆరుగురు కలిసి బుక్ చేసుకుంటే తక్కువ ధరకే వెళ్లి వచ్చేయచ్చు. స్టాండర్డ్‌లో ట్రిపుల్ షేరింగ్ లో ఒకరికి రూ.3,170, ట్విన్ షేరింగ్ ఒకరికి రూ.3,700 చెల్లించాలి. కంఫర్ట్‌లో ట్రిపుల్ షేరింగ్ అయితే ఒకరికి రూ.4,860, ట్విన్ షేరింగ్ ఒకరికి రూ.5,390 చెల్లించాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version