డబ్బులు ఉన్నప్పుడు చాలా మంది పొదుపు చేయాలని చూస్తూ వుంటారు. నచ్చిన పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. మీరు కూడా మంచి పాలసీ లో డబ్బులని పెట్టాలని అనుకుంటున్నారా..? అయితే ఈ పాలసీ గురించి చూడాల్సిందే. భారతదేశంలో ఇన్సూరెన్స్ పథకాల్లో పెట్టుబడి పెట్టడం మంచిదే. పైగా కొత్త పాలసీలను కూడా రోజు రోజుకీ ప్రవేశపెడుతూ ఉంటుంది ఎల్‌ఐసీ.
ఇక ఎల్‌ఐసీ అందించే ఉమంగ్ ప్లాన్ గురించి చూసేద్దాం. ఎల్‌ఐసీ జీవన్ ఉమంగ్ ప్లాన్ తో కుటుంబానికి ఆర్థిక భద్రత, రక్షణ ఉంటుంది. ప్రీమియం-చెల్లింపు వ్యవధి ముగింపు నుంచి మెచ్యూరిటీ సమయం దాకా ప్లాన్ వార్షిక సర్వైవర్ ప్రయోజనాలను ఇస్తుంది. పాలసీ వ్యవధి లో పాలసీదారు మరణించినప్పుడు ఒకేసారి బీమా మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈ పాలసీ తీసుకుంటే కొన్ని లాభాలని పొందడానికి అవుతుంది. పన్ను రహిత మెచ్యూరిటీ, మరణ ప్రయోజనం, 30 ఏళ్ల వరకు ఆదాయం హామీ ఉంటాయి.
అలానే వంద సంవత్సరాల వయస్సు వరకూ జీవితకాల రిస్క్ కవర్, ప్రమాదవశాత్తు మరణ కవరేజ్, వైకల్య ప్రయోజనం, ప్రీమియం మినహాయింపు ప్రయోజనం కూడా ఉంటాయి. ఈ పాలసీ ని తీసుకోవడానికి కనీసం 90 రోజులు గరిష్టంగా 55 సంవత్సరాలు ఉండాలి. కనీస హామీ మొత్తం వచ్చేసి 2,00,000. గరిష్ట హామీ మొత్తం పరిమితి లేదు. 30 ఏళ్ల వ్యక్తి నెల నెలా రూ. 5,000, త్రైమాసిక రూ. 15,000 ని కానీ సంవత్సరానికి రూ. 50,000 పెట్టుబడి పెట్టవచ్చు. కనీస హామీ మొత్తం రూ. 2,00,000. పాలసీలో ప్రవేశించే సమయానికి మూప్పై ఏళ్లు ఉంటే రూ.10 లక్షల హామీ మొత్తం వస్తుంది. పాలసీ చెల్లింపు వ్యవధి ఇరవై ఏళ్లు. 70 సంవత్సరాల రిస్క్ కవరేజ్ ఉంటుంది.