తెలంగాణ సచివాలయం దగ్గర కలకలం..ఇజ్రాయిల్ జెండాను

-

తెలంగాణ రాష్ట్ర సచివాలయం దగ్గర కలకలం చోటుచేసుకుంది. ఇజ్రాయిల్ జెండాను జకీర్ అనే వ్యక్తి తొలగించాడు. జెండాను తొలగిస్తూ సోషల్ మీడియాలో లైవ్ కూడా పెట్టాడు జకీర్ అనే యువకుడు. ఈ వీడియో వైరల్ కావడంతో వెంటనే అధికారులు స్పందించారు. అనంతరం రంగంలోకి దిగిన అధికారులు తిరిగి ఇజ్రాయిల్ జెండాను ఏర్పాటు చేశారు.

Hyderabad Youth pulls down Israeli flag hoisted for Miss World pageant, live streams event
Hyderabad Youth pulls down Israeli flag hoisted for Miss World pageant, live streams event

ఈ సంఘటనపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు కూడా నమోదు అయింది. ఆ యువకుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇలా ఇజ్రాయిల్ జెండాను తొలగించడం పై కొత్త చర్చ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news