హైడ్రా ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ ఫోకస్..!

-

తుర్కయంజాల్ చెరువును సందర్శించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అయితే చెరువు తూములు మూసేసి అలుగు పెంచడంతో చెరువు పై భాగంలో పంటపొలాలు, ఇళ్ళు నీట మునుగుతున్నాయని స్థానికులు ఇటీవల హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చారు. ఈ నేపథ్యంలో నేరుగా క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పరిశీలించిన హైడ్రా కమిషనర్.. ఇరిగేషన్ ఇంజనీర్లు, రెవెన్యూ అధికారులతో చర్చిస్తాం, అలాగే ఐఐటి, బిట్స్ పిలాని, JNTU ఇంజనీరింగ్ నిపుణులతో కూడా అధ్యయనం చెస్తామన్నారు.

NRSC ఇమేజీలు, గ్రామాలకు చెందిన మ్యాప్స్ తో పరిశీలించి రెండు మూడు నెలల్లో శాస్త్రీయ పద్ధతుల్లో చెరువు FTL నిర్ధరిస్తాం. నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటాం. నగరంలో కొన్ని చెరువులు మాయం అయితే మరికొన్ని చెరువులు FTL పరిధి పెరుగుతున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి.. వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. తుర్కంజాల్ చెరువులోకి మురుగు నీరు వచ్చి చేరుతోంది. ఆ నీరు కిందకు పోవడం లేదని స్థానికుల ఫిర్యాదు చేసారు. తాము ఇంటి స్థలాలు కొన్నప్పుడు ఈ స్థలంలో నీరు నిలవ లేదని తుర్కంజాల్ చెరువు పై భాగంలో ఆదిత్య నగర్ నివాసితుల ఫిర్యాదు ఇచ్చారు. చెరువుకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకొని శాస్త్రీయ పద్దతిలో FTL నిర్ణయిస్తామని హామీ ఇచ్చారు రంగనాథ్.

Read more RELATED
Recommended to you

Latest news