కూటమి పాలనలో రాష్ట్ర అభివృద్ధి శూన్యం. చంద్రబాబు పాలనలో మధ్య తరగతి బతుకులు చిన్నబిన్నం చేస్తున్నారు అని వైసీపీ సీనియర్ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఏ ఒక్క పథకం కూడా సక్రమంగా అందటం లేదు. గత ప్రభుత్వ హయంలో ఏ టైంలో రావాల్సిన పథకాలు అదే టైంలో వచ్చేవి. ఏడు నెలల్లో లక్షా ఇరవై వేల కోట్ల అప్పులు తెచ్చారు. సత్యదూరమైన మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చారు. తెచ్చిన అప్పు డబ్బులు ఏం చేస్తున్నట్లు.. విద్యారుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది.
వైసీపీ హయాంలో అప్పులపై వచ్చి అబద్ధాలు చెప్పిన చంద్రబాబు. ఆరోగ్యశ్రీని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. వచ్చిన మెడికల్ కళాశాలలు కూడా వద్దని వెనక్కు పంపిస్తున్నారు. మోదీ చేస్తున్న ప్రారంభోత్సవాలు మొత్తం వైసీపీ హయాంలో తెచ్చిన ప్రాజెక్టులే. ఎనిమిది నెలల్లో ప్రజలకు ఒక్క మేలు చేయని చంద్రబాబు.. యువతను పక్కదోవ పట్టించేలా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మహిళలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. ఒక్కొక్క నెలలో ఒక్కోక్క టాపిక్ మీద హడావుడి చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రాష్ట్రాని గంజాయిమయంగా మార్చారు. కేవలం పబ్లిసిటీ తోనే పరిపాలన చేస్తున్న చంద్రబాబు.. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చాలి అని గడికోట శ్రీకాంత్ పేర్కొన్నారు.