హైడ్రా కోసం FM రేడియో స్టేషన్ : కమిషనర్ రంగనాథ్

-

హైడ్రా కోసం ఒక FM రేడియో స్టేషన్ పెట్టాలని ఆలోచన చేస్తున్నాం అని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నోటరీ ఉన్న భూములు కొనెప్పుడు ప్రజలు ఆలోచించాలి. రెండు మూడు రకాలుగా వెరిఫై చేసి కోణాలని ప్రజలను మా విజ్ఞప్తి. అనుమతి లేని నిర్మాణాల్లో బిజినెస్ చేసేవాళ్ళు.. నోటీస్ ఇచ్చిన వెంటనే కాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇళ్ళు, ప్లాట్స్ కోనే వారి కోసం బఫర్, FTL లో ఉన్నాయా లేవా చెప్పేందుకు హైడ్రా ఒక వెబ్ సైట్ ఏర్పాటు చేస్తాం. అయితే జూలై 19 కు ముందు కట్టిన వాటిని హైడ్రా కూల్చదు. పర్మిషన్ లేకుంటే కూల్చివేస్తాం.

ఇప్పటి వరకు 200 ఎకరాలు హైడ్రా కాపాడింది. 2025 లో 12 చెరువులు హైడ్రా సుందరికరించాలని టార్గెట్ పెట్టుకుంది. ల్యాండ్ గ్రబ్బర్స్, ల్యాండ్ మాఫీయా వాళ్లు హైడ్రా ను వ్యతిరేకిస్తున్నారు. ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా హైడ్రా వైపు చూస్తున్నారు. ప్రజలు, చదువుకున్న వాళ్ళు హైడ్రా వైపు వస్తున్నారు. సామాన్యులను ఇబ్బందిపెట్టే ఉద్దేశ్యం హైడ్రాకు లేదు. మీరట్ లో అక్రమ నిర్మాణాలు కూల్చివేయమని సుప్రీం కోర్టు చెప్పింది. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ ఎక్కడా దెబ్బ తినడం లేదు. గతంలో FTL లో నిర్మించిన వాటిని హైడ్రా కూల్చదని చెప్పాము. అక్కడ నిర్మాణాల్లో ఉన్నోళ్ళకు ఇంకెవ్వరూ నిర్మాణాలు. చేపట్టకుండా చూసుకోవాలని చెప్పాము. పేద వారి నీ ముందు పెట్టీ కొందరు బడా బాబులు వెనకాల ఉండి నడిపిస్తున్నారు అని కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version