హైదరాబాద్ మహానగర ప్రజలకు అలర్ట్. ఇవాల్టి నుంచి హైదరాబాద్ మహానగరంలో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు హైడ్రా స్పష్టం చేసింది. ముఖ్యంగా మేడ్చల్ సైబరాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సూచనలు చేసింది. ఆగస్టు 13, 14 అలాగే 15 తేదీలలో వాహనాల వాడకం తగ్గించాలని కోరింది హైడ్రా.

సాధ్యమైనంత వరకు బయటకు రాకూడదని కూడా సూచనలు చేసింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవాళ్లు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని స్పష్టం చేశారు. అలాగే హెల్ప్ లైన్ నెంబర్లు కూడా.. హైదరాబాద్ నగరానికి చెందిన హైడ్రా విడుదల చేసింది.
కాగా బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఇవాళ అలాగే రేపు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు పడుతాయని వార్నింగ్ ఇచ్చింది. దింతో అప్రమత్తమైన ఇరు రాష్ట్రాల అధికారులు ముందస్తు చర్యల్లో నిమగ్నం అయిన సంగతి తెలిసిందే.