ఆదివారం మళ్లీ దిగిన హైడ్రా..కూకట్‌ పల్లి, అమీన్ పూర్ లో కూల్చివేతలు…!

-

ఆదివారం మళ్లీ రంగంలోకి దిగింది హైడ్రా. కూకట్‌ పల్లి, అమీన్ పూర్ లో కూల్చివేతలు జరుగుతున్నాయి. కూకట్ పల్లిలో అక్రమ నిర్మాణల పై హైడ్రా కొరడా విధిస్తోంది. నల్ల చెరువు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయనున్నారు హైడ్రా అధికారులు.

Hydra landed again on Sunday Demolition of Kukatpally and Amin Poor

తెల్లవారుజామునే చేరుకున్న హైడ్రా సిబ్బంది… భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకుని..నల్ల చెరువు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. నల్ల చెరువు పరిధిలో ఉన్న మొత్తం 16 నిర్మాణాలకు నోటీసులు..ఇచ్చారు హైడ్రా అధికారులు. ఇవాళ ఉదయమే అక్కడి చేరుకుని.. కూల్చివేస్తున్నారు అధికారులు. అమీన్ పూర్ లోనూ హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version