జబర్దస్త్ షో కి హైపర్ ఆది గుడ్ బై..?

-

జబర్దస్త్ షో కి హైపర్ ఆది గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తోంది.ఈటీవీ లోజబర్దస్త్ కామెడీ షో ఇంత పెద్ద సంచలన విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు.మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మాణం సారథ్యంలో ప్రారంభమైన ఈ రియాలిటీ షో సౌత్ లోనే ట్రెండ్ సెట్ చేసిన షో గా రికార్డు సృష్టించిందిి.అయితే ఈ షోకి ముందుగా వన్నె తెచ్చింది మాత్రం జడ్జి లే అని చెప్పుకోవాలి.మెగా బ్రదర్ నాగబాబు మరియు రోజా ఎంతోకాలం నుండి జడ్జిలుగా ఈ షాలో పాల్గొంటూ వచ్చారు.కానీ ఎప్పుడైతే నాగబాబు ఈ షో మానేశారో అప్పటి నుండి ఈ షో కి కాస్త కళ తప్పింది అనే చెప్పుకోవాలి.

ఈ షో ద్వారా ప్రేక్షకుల ఆదరణ విపరీతంగా చూసిన ఎంతో మంది కమెడియన్స్ కి వరుసగా సినిమాల్లో అవకాశాలు రావడంతో వాళ్లు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ షో ని వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది.తాజాగా ఎమ్మెల్యే రోజా కూడా మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ మానేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.ఇప్పుడు ఆ జాబితాలో చేరిపోయాడు హైపర్ ఆది.ఇటు జబర్దస్త్ కి, అటు డీ షో కి మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నాయి అంటే దానికి ముఖ్యకారణం హైపర్ ఆది, మరియు సుడిగాలి సుదీర్ అని చెప్పుకోవచ్చు.

అయితే ఇప్పుడు హైపర్ ఆది జబర్దస్త్ షో ని వదిలేయబోతుండడమ్ తో ఈ షో మరింత బలహీనపడే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.గత మూడు వారాల నుండి హైపర్ ఆది జబర్దస్త్ షో లో కనిపించకపోయేసరికి trp రేటింగ్స్ బాగా తగ్గిపోయాయట.కాగా ఈ వార్తపై అటు మల్లెమాల నుంచి కానీ, ఇటు హైపర్ ఆది నుంచి గాని స్పందన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version