అముల్ సంస్థలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. పాల సంస్థ అయినటువంటి ఆముల్ విజయవాడ సర్కిల్ పరిధిలో ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఈ మేరకు అమూల్ నోటిఫికేషన్ ని కూడా విడుదల చేయడం జరిగింది. దీనిలో భాగంగా అకౌంట్స్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మరి ఇక ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాల లోకి వెళితే..

ఈ జాబ్స్ కోసం స్త్రీ, పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష కూడా లేదు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎవరు అర్హులు అన్నది చూస్తే.. అభ్యర్థులు ఫైనాన్షియల్ అకౌంటింగ్, కమర్షియల్ నార్మ్స్ & టాక్సేషన్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

అలానే వయస్సు చూస్తే.. 28 ఏళ్ల వయస్సు మించకూడదు. కంప్యూటర్లపై మంచి పరిజ్ఞానం కలిగి ఉండాలి కూడా. SAP యొక్క పరిజ్ఞానం కల వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఇది ఇలా ఉంటే అప్లై చేసుకోవాలని అనుకునే వాలారు అధికారిక వెబ్ సైట్ నుండి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక దరఖాస్తు ఫీజు గురించి చూస్తే.. జనరల్, ఓబీసీ అభ్యర్థులుకి ఎలాంటి ఫీజు లేదు. దరఖాస్తు ప్రారంభ తేదీ ఏప్రిల్ 14, 2022. దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 30, 2022. శాలరీ విషయానికి వస్తే.. వేతనం రూ 38,000 ఉంటుంది. పూర్తి వివరాలను http://careers.amul.com/job-listings-accounts-assistant-vijayawada-gujarat-cooperative-milk-marketing-federation-ltd-vijayawada-0-to-2-years-130422007649# లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version