ఈరోజు నేనిలా ఉన్నా అంటే నా ప్రాణ స్నేహితుడు చరణ్ వలనే….

-

శర్వానంద్: రామ్ చరణ్ , శర్వానంద్ వీళ్ళిద్దరూ ఇండస్ట్రీలో చిన్నప్పటినుండి బెస్ట్ ఫ్రెండ్స్. వీరిద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు.వీరితో పాటు రానా కూడా చదువుకున్నాడు. అయితే రానా వీరికంటే సీనియర్ కావడంతో కొంతవరకు భయపడే వారిని శర్వానంద్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు.

ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులు అంటే వీరి గురించే చెపుతారు. చరణ్ ఫ్రెండ్స్ అంటే ప్రాణం ఇస్తాడు. శర్వానంద్ కు ఏది కావాలన్నా ముందు ఉండి చేస్తాడు .అలాగే శర్వానంద్ పెళ్లి చరణ్ తన చేతుల మీదనె చేయించాడు. ఇటీవల శర్వానంద్ చరణ్ గురించి ఉస్తాద్ షో లో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. చరణ్ లాంటి స్నేహితుడు దొరకడం తాను చేసుకున్న పుణ్యమని చెప్పాడు. మంచు మనోజ్ పోస్ట్ గా చేస్తున్న ఉస్తాద్ షోలో శర్వానంద్ సందడి చేశాడు. మనోజ్, శర్వానంద్, చరణ్ చిన్నప్పటినుండి మంచి ఫ్రెండ్స్. ఆ షో అంతా వీళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలతో నిండిపోయింది. చిరంజీవి గారు చాలా గొప్పవారు అని అన్నాడు.చరణ్ లాంటి ప్రాణ స్నేహితుడు ఉన్నాడు అని నేను గర్వంగా చెప్పుకోగలను అన్నాడు. వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version