సుధీర్ కి పిలిచి మరి అవకాశాన్ని ఇచ్చాను.. కానీ అలా చేస్తాడా..?

-

బుల్లితెరపై ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేరు జబర్దస్త్ షో అని చెప్పవచ్చు. ఎందుచేత అంటే అందులో పాల్గొన్న కమెడియన్స్ సైతం ఒక్కొక్కరు బయటికి రావడంతో ఈ షో టిఆర్పి రేటింగ్ పై కొంతమంది కమెడియన్స్ పలు విధాలుగా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కిరాక్ ఆర్పి మాట్లాడిన మాటలు పెను దుమారంగా మారాయి. ఇక ఈ షో నిర్వాహకులు అయిన శ్యాం ప్రసాద్ రెడ్డి పైన ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ షో కి మేనేజర్ గా పనిచేస్తున్న ఏడుకొండలు స్వయంగా వచ్చి జబర్దస్త్ మీద వస్తున్న ఆరోపణల పై స్పందించడం జరిగింది. వాటి గురించి చూద్దాం.

తాజాగా ఏడుకొండలు ఒక ప్రముఖ ఇంటర్వ్యూ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ.. జబర్దస్త్ పై వస్తున్న ఆరోపణలను కొట్టి పారేయడం జరిగింది. ఆర్పి చేసిన వ్యాఖ్యలలో ఒకటి కూడా వాస్తవం లేదని తెలియజేశారు. అంతేకాకుండా సుడిగాలి సుదీర్ విషయాన్ని మొత్తం బట్టబయలు చేశారు. సుధీర్ కి లైఫ్ ఇచ్చింది నేనే కానీ ఫోన్ చేస్తే ఇప్పుడు నా ఫోనే లిఫ్ట్ చేయడం మానేశారని తెలియజేశారు. నాలుగు డబ్బులు, నలుగురు అభిమానులను సంపాదిస్తే మనం ఎక్కడి నుంచి వచ్చాము అనే విషయం మర్చిపోతారా అని తెలిపారు ఏడుకొండలు.

ఏడుకొండలు ఒకసారి షాపింగ్ మాల్ ని ఓపెన్ చేయడం కోసం సుదీర్ ని కలవగా తన మేనేజర్ తో మాట్లాడమని చెప్పారట. కానీ సుదీర్ మాత్రం జబర్దస్త్ నుంచి ఎందుకు బయటకు వచ్చారు అని యాంకర్ అడగగా.. అందుకు ఏడుకొండలు మాట్లాడుతూ.. ఇది నేను చేసిన ఫోన్ లిఫ్ట్.. చూస్తే అన్ని విషయాలు తెలుస్తానని చెప్పాడు అంతేకాకుండా ఈ ఇంటర్వ్యూ లైవ్ లో కూడా ఫోన్ చేయడం జరిగింది. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా సినిమాలో బిజీగా ఉన్నానని తెలుపుతూ ఉంటాడని తెలిపారు ఏడుకొండలు. కానీ సుధీర్ ఏ సినిమా చేసినా కూడా ఫ్లాప్ గానే నిలిచింది అని తెలిపారు ఏడుకొండలు. మరి ఈ విషయంపై సుధీర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version