వైసీపీ ఎమ్మెల్యేలు ఈ మధ్య తమ అసహనం పదే పదే బయటపెడుతున్నారు. తాజాగా సాగునీటి సలహా మండలి సమావేశంలో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అసహనం వ్యక్తం చేసారు. దెందులూరు నియోజకవర్గంకు సాగు నీటి విషయంలో అన్యాయం జరుగుతుంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. అటు గోదావరికి, ఇటు కృష్ణాకు చివరి ఆయకట్టుగా మా ప్రాంతం ఉంది అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
నీరు విడుదల చేశాక 30 రోజుల వరకూ మాకు నీరు అందడంలేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. మార్చి 10 నిలిపివేయకుండా మరో 2 వారాలు అదనంగా గోదావరి నీరివ్వాలి అని డిమాండ్ చేసారు. అలాగే వాటర్ మేనేజ్మెంట్ సక్రమంగా లేకపోవడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయి అన్నారు. వరదల్లో తమ్మిలేరు, కొల్లేరు ముంపుతో మా ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయారు అని ఆయన పేర్కొన్నారు. తన నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదు అన్నారు.