పచ్చ బటన్ నొక్కడమే తప్ప.. వాట్సప్ వాడటం రాదు: ఈటల

-

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి ఈటల రాజేందర్, పదో తరగతి పేపర్ లీకేజీ వ్యవహారంపై స్పందిస్తూ మాట్లాడారు. కేసులోని నిందితులు ఈటల రాజేందర్‌కు కూడా ఈ పేపర్లను పంపించారని వరంగల్ సీపీ తెలిపారు. ఈ అంశంపై మాట్లాడిన ఈటల రాజేందర్.. తనకు నాకు ఎర్ర బటన్, పచ్చ బటన్ మాత్రమే తెలుసు అని అన్నారు. తనకు వచ్చే వాట్సాప్‌లు పీఏలు చూస్తారని ఈటల రాజేందర్ వెల్లడించారు. రాజకీయ నాయకులకు ఫోన్లు వస్తూ ఉంటాయని అన్నారు ఆయన. ఎవరు ఫోన్ చేసినా మేం స్పందిస్తామని చెప్పారు. ఈ వ్యవహారంలో విచారణ చేయాల్సింది పోలీసులే అని స్పష్టం చేశారు. నిన్న ఉదయం నుంచి ఫోన్ చూడలేదని అన్నారు. తనకు ఫోన్‌కు మెసేజ్ వచ్చినట్టు తనకేమీ సమాచారం లేదని వెల్లడించారు. ఇది చాలా చిన్నఘటన మాత్రమే అని.. ఇందులో కుట్ర లేదని ఈటల రాజేందర్ వివరించారు.

చాలా సందర్భాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయని.. చాలా సెంటర్లలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలియచేశారు. దీన్ని కుట్ర అనే వాదనతో ఏకీభవించడం లేదని అన్నారు. పరీక్ష జరుగుతున్న సమయంలో పేపర్ బైటికి రావడాన్ని లీకేజీ అనలేమని అన్నారు. టీఎస్‌పీఎస్‌సీ వ్యవహారంలో ఉదాసీనంగా వ్యవహరిస్తే.. దాని విషయంలో చర్యలు లేవని ఈటెల అన్నారు. దాని నుంచి ఇష్యూను డైవర్ట్ చేసేందుకే ఈ వ్యవహారమని ఆయన మండిపడ్డారు. టీఎస్‌పీఎస్‌సీని రద్దు చేశారా ? అని ప్రశ్నించారు ఈటెల.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version