ఐ హేట్ యూ రష్మిక.. సాయి ధరంతేజ్ పోస్ట్ వైరల్..!!

-

ప్రముఖ మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన తాజా చిత్రం సీతారామం. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ముస్లిం అమ్మాయి పాత్రలో కనిపించింది. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్ అలాగే స్వప్న సినిమాస్ బ్యానర్స్ పై హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ముఖ్యంగా సాయి ధరంతేజ్ తాజాగా ఐ హేట్ యూ రష్మిక అంటూ ఈ సినిమాపై తన రివ్యూ పోస్ట్ చేయడం జరిగింది. ఇకపోతే ఇటీవల ఆగస్టు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటుంది. ముఖ్యంగా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా ఉందని ఇన్ని రోజుల తర్వాత ఒక అద్భుతమైన ప్రేమ కథ చూస్తున్నామంటూ తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ సినిమాకి ముందు విడుదలైన టీజర్స్, సాంగ్స్ అన్ని కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన టాక్ కూడా సినిమా రేంజ్ ను పెంచేసి బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై సినీ ప్రముఖులు, క్రిటిక్స్ అందరూ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

స్వప్నక్క ఐ హేట్ యు అంటూ తన రివ్యూ మొదలుపెట్టి.. సినిమా కోసం చేసిన ప్రతి ఒక్కరి గురించి సాయి ధరంతేజ్ ప్రస్తావించారు.ఈ సినిమా ప్రేక్షకులు ముందు తీసుకురావడానికి రెండు సంవత్సరాలు నువ్వు ఎంత కష్టపడ్డావో రామ్ , సీత ప్రేమ కథను ఎంతగా నమ్మావో నాకు తెలుసు స్వప్నక్క అని పేర్కొన్నారు.

ఇక రష్మిక ను కూడా ఐ హేట్ యూ అంటూ ఆమె నటనను తెగ పొగిడారు సాయిధరమ్ తేజ్ . నటిగా ఎప్పటికీ మరువలేని పెర్ఫార్మన్స్ ఇచ్చావు రష్మిక. క్లైమాక్స్లో నీ అమాయకత్వం ఒక మెరుపు.. సీతకు రామ్ పంపిన సందేశాన్ని చేర్చే దూతగా నీ నటన చూసి ఐ హేట్ యూ అనాలని ఉంది అంటూ తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version