ఎనుమల తిరుపతి రెడ్డి రైతులను బెదిరించిన కాల్ రికార్డు నా దగ్గర ఉంది : కేటీఆర్

-

వికారాబాద్ జిల్లాలోని దుంద్యాల మండలం లగచర్లలో జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులపై జరిగిన దాడి ఘటనలో ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నది. ఇప్పటికే ఈ దాడి వెనుక కుట్రకోణం దాగి ఉన్నదని ఐజీ వీ సత్యనారాయణ బుధవారం ప్రకటించారు. ఈ కేసులో ఏ1గా పట్నం నరేంద‌ర్ రెడ్డిని అరెస్టు చేయగా.. కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. మరో 16 మందిని సైతం ఈ కేసులో అరెస్టు చేశామన్నారు.ఎవరైతే సురేశ్ రైతులను, గ్రామస్తులను రెచ్చగొట్టాడో అతన్ని కూడా అరెస్టు చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

దీనిపై తాజాగా కేటీఆర్ స్పందిస్తూ..కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు పెడుతోందని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ సోదరుడు ఎనుముల తిరుపతి రెడ్డి ఫార్మా సిటీ పేరిట రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని.. రైతులు భూములు ఇవ్వకపోతే తన్ని తీసుకుంటానని మాట్లాడిన వాయిస్ రికార్డు తన వద్ద ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు.దీనికి సంబంధించిన వీడియోనెట్టింట వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version