ఐ లవ్ యాక్టర్స్.. ఐ లవ్ ఊమెన్.. జగపతి బాబు

-

టాలీవుడ్ హీరో జగపతిబాబు ఎంత ముక్కు సూటి మనసు అందరికీ తెలిసిందే ఏ విషయాన్ని అయినా మొహమాట పడకుండా మాట్లాడేస్తూ ఉంటారు తన కెరీర్ లైఫ్ మనీ అనే విషయాల్లో ఎలాంటి అభ్యంతరం లేకుండా ఎప్పటికప్పుడు జరిగిన విషయాలు అన్నీ చెప్పుకొస్తూ ఉంటారు తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్లతో వస్తున్న రూమర్లు పై స్పందించారు

హీరో జగపతిబాబు తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు భాగంగా గతంలో మీకు సౌందర్య, ప్రియమణితో ఎఫైర్లు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి కదా అంటూ ప్రశ్నించగా తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు..

ఇప్పటికే జీవితంలో వైన్ టన్నుల కొద్దీ తాగాం ఇక అయిపోయింది. ఉమెన్ తో అంటే 60 వచ్చేశాక ఇంకేం ఉంటుంది.. అని నిజాయితీగా చెప్పుకొచ్చారు. కథానాయికలతో రకరకాల గుసగుసలు వినిపించాయి కదా అంటూ ప్రశ్నించగా.. నేను అందరు హీరోయిన్లతో బావుంటాను. ఐ లవ్ ఉమెన్.. ఐ లవ్ యాక్టర్స్.. వారితో కంపెనీని ఇష్టపడతాను. అయితే ఇక్కడ ఏం చేశామో చేయలేదు అనేది విషయం కాదు ఎంత స్నేహంగా ఉండేది అనేది ముఖ్యం అంటూ తెలిపారు

అప్పట్లో కొందరు హీరోయిన్లతో మీరు ఎఫైర్ సాగించారని కథనాలొచ్చాయి కదా అంటే.. నేను అందరు హీరోయిన్లతో బావుంటాను.. ”నాతో జెన్యూన్ గా సిస్టర్స్ లా ఉన్న వాళ్లున్నారు. కీర్తి సురేష్, శ్రుతిహాసన్, అనుష్క వీళ్లంతా సిస్టర్స్ లా ఉంటారు. సిస్టర్ అనేది పెద్ద పదం కాబట్టి నేను నార్మల్ ఫ్రెండ్స్ అంటాను.. ఏదైనా మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది” అని అంటా అన్నారు.

మీరు మగువల మనసుకు దగ్గరగా ఉంటారా అని ప్రశ్నిస్తే.. ”నా స్వభావం అంతే. చిన్నప్పటి నుంచి నా మేనకోడలు అవ్వొచ్చు.. ఇంకొకరి సిస్టర్స్ అవ్వొచ్చు.. ఎవరైనా అవ్వొచ్చు. వాళ్లతోనే ఆడుకున్నాను. వారందరినీ సిస్టర్స్ లా చూసేవాడిని. అది నా నేచుర్” అని తెలిపారు.

మీరు ఉమెనైజరా? అని ప్రశ్నిస్తే.. ఉమెనైజర్ అనేది రాంగ్ వర్డ్. అది చీఫ్ వర్డ్. వట్టి సెక్స్ కోసం పడేవాడు ఉమనైజర్. సెక్స్ కంటే మేకింగ్ లవ్ అనేది నమ్ముతాను. ప్రేమను ఇవ్వడం తీసుకోవడం అనేదాన్ని నేను కచ్చితంగా నమ్ముతాను. ఆడాళ్ల కష్ట నష్టాలు తెలుసుకుంటే అన్నీ వాళ్లే భరిస్తారు. మోనోపాజ్ నుంచి ప్రతిదీ అర్థం చేసుకోవాలి. తల్లి కంటే ఈ సృష్టిలో ఇంకెవరూ గొప్పవాళ్లు ఉండరు… అని జగపతి అన్నారు.

సౌందర్య తో ప్రియమణి తో ఎఫైర్ వార్తలు వచ్చాయి కదా ఆరోజుల్లో అని ప్రశ్నించగా.. ”రూమర్స్ వస్తాయి.. ఎందుకు రావు.. ఒకటే గుర్తుంచుకోండి. ఒక పోలీసాఫీసర్ ని చూస్తే..ఆమె విమెన్ అయితే నేను ఎంతో గౌరవిస్తాను. లేడీ పోలీసాఫీసర్ అందంగా ఉండాలనేం కాదు. చూడగానే అలా ఉండాలి ఉమెన్ అనుకుంటాను. పోలీసాఫీసర్ అయిన ఆడాళ్లను చూస్తే నాకు చాలా ఇష్టం. ఒక ఐఏఎఎస్ ఆఫీసర్ ఉమెన్ అయితే చాలా ఇష్టం. ఉమెన్ పవర్ ఫుల్ గా ఉంటే ఇష్టపడతాను. ఈ రోజుల్లో అమ్మాయిలు అలా ఉంటేనే రాణించగలరు అలాగే ఉండాలి కూడా. నేను ఆడవాళ్లను గౌరవిస్తాను. అమ్మాయిని చూడగానే తనతో పడుకోవడం అనేది కరెక్ట్ కాదు.. ప్రతి ఒక్క అమ్మాయిని పడుకోవాలని ఉద్దేశంతోనే చూడలేము కొందరు కుటుంబానికి స్నేహితులు అవుతారు అలాంటి వారి మీద ఎప్పటికీ ఆలోచన రాదు ” అంటూ చెప్పుకొచ్చారు జగపతిబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version