రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ మీద పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సైతం ఓ వీడియో రిలీజ్ చేసింది. అధికార పార్టీకి మద్దతుగా ఓ వీడియో చేయాలని కాంగ్రెస్ వాళ్లు తనకు కాల్ చేశారని.. అందుకు నో చెప్పానని వీడియో సందేశంలో పేర్కొన్నారు. మీరు చేసిందే తప్పు..మళ్లీ మీకు సపోర్టుగా ఎలా వీడియో చేస్తానంటూ సదరు ఇన్‌ఫ్లుయెన్సర్ ‘అమ్ము డయానా’ చీవాట్లు పెట్టినట్లు పేర్కొంది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో గల 400 ఎకరాల్లో చెట్ల నరికివేత అంశం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయిన తరుణంలో ప్రభుత్వానికి మద్దతుగా.. హెచ్‌సీయూకు వ్యతిరేకంగా వీడియో చేయాలని తనను కోరినట్లు సదరు యువతి సోషల్ మీడియోలో స్టేట్మెంట్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీని నెటిజన్లు ఓ రేంజ్లో విమర్శిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా, HCUకు వ్యతిరేకంగా వీడియో చేయాలని కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ చేసి నన్ను అడిగారు – సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ (ammu_diana_official) pic.twitter.com/6on3FHJi07
— Telugu Scribe (@TeluguScribe) April 4, 2025