ప్రేమ్ రక్షిత్ : ఆనందం తో బాత్ రూమ్ లో ఏడ్చాను.!

-

రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్  గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ లో  బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ‘నాటు నాటు’ సాంగ్   గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సాధించింన  సంగతి అందరికీ తెలిసిందే. దీనితో దేశం మొత్తం ఆర్ ఆర్ ఆర్ టీమ్ కు అభినందనలు తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ ఆ పాటకు ప్రాణం పోసిన వారిని అందరిని పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఈ సినిమాలోని ఈ పాట ఈ అవార్డును అందుకోవడంతో  ఆఖరికి దేశ ప్రధాని మోదీ కూడా సినిమాపై ప్రశంసల కురిపించారు.ఇక ఈ పాట ఇలాంటి ఒక గొప్ప అవార్డును అందుకోవడంతో ఈ పాటకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించినటువంటి ప్రేమ్ రక్షిత్ స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. ఈ పాట కోసం నా జీవితం లో ఏ పాటకు పడని కష్టం పడ్డానని తెలిపాడు. అలాగే ఈ పాట కోసం సుమారు 50 రకాల మూమెంట్స్ తయారు చేయగా ఈ ఒక్క స్టెప్ మాత్రమే రాజమౌళి గారికి నచ్చిందని తెలిపారు.

ఈ పాట మంచిగా రావడం కోసం దాదాపు 20 రోజులపాటు హీరోలు డాన్స్ చేస్తూనే ఉన్నారని  ప్రేమ్ రక్షిత్ తెలిపారు.ఈ పాట కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారని ఈ కష్టానికి తగిన ప్రతిఫలమే గోల్డెన్ గ్లోబ్ అవార్డు అని ప్రేమ్ రక్షిత్ వెల్లడించారు. అయితే నేను డాన్స్ కంపోజ్ చేసిన పాట  కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు  వచ్చిందని తెలియడం తో ఆనందం తో ఉబ్బి తబ్బిబ్బు అయ్యానని ఆనందం తో బాత్ రూమ్ లో  గంటన్నర పాటు ఏడ్చానని ప్రేమ్ రక్షిత్ నాటు నాటు పాట  కష్టం గురించి ఎమోషన్ అయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version