యాక్షన్ సీన్స్ చేయడంలో ప్రమాదాలు జరుగుతూ ఒక్కోసారి ప్రాణాలమీదకి వస్తుందని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అన్నారు.ఆయన నటించిన ‘బ్లూ’ మూవీ షూటింగ్ సమయంలో ఎదురైన సంఘటన గుర్తు చేసుకున్నారు.అయితే ఒకసారి సముద్రంలో యాక్షన్ సీన్స్ చేసే సమయంలో సొరచేపలు తన వెంటపడ్డాయని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తెలిపారు.
‘బ్లూ’ సినిమా షూటింగ్ సమయంలో ఎదురైన సంఘటన గురించి ఆయన మాట్లాడుతూ.. ‘సముద్రంలో 150 అడుగుల లోతులో స్టంట్ సీన్స్ చేస్తున్నప్పుడు గాయమై రక్తం వచ్చింది. అప్పుడు పదుల సంఖ్యలో సొరచేపలు నా చుట్టూ చేరాయి. అవి నన్ను తినేస్తాయేమోనని భయపడ్డా. వాటి నుంచి తప్పించుకుని సురక్షితంగా బయటపడ్డా’ అని చెప్పుకొచ్చారు.ఆంటోనీ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బ్లూ’. కత్రినా కైఫ్ కథానాయికగా నటించగా,సంజయ్ దత్, రాహుల్ దేవ్ కీలక పాత్రలు పోషించారు.ప్రస్తుతం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అబ్బాస్ జాఫర్ డైరెక్షన్ లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి ‘బడే మియా ఛోటే మియా’ చిత్రంలో నటిస్తున్నారు.