భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం తెల్లవారుజామున ప్రధాని మోడీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య రక్షణ, వాణిజ్య, పరస్పర సహకారం, టెక్నాలజీకి సంబంధించిన అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు సమాచారం.

అయితే, భారత్ విధిస్తున్న సుంకాల పట్ల ట్రంప్ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుండగా.. మీ ఇద్దరిలో ఎవరు మంచి సంధానకర్త అని ట్రంప్‌ను విలేకరులు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ట్రంప్.. మోదీ తన కంటే కఠినమైన సంధానకర్త అని వ్యాఖ్యానించారు. ఆ విషయంలో తాను పోటీపడలేనని అమెరికా అధ్యక్షుడు వెంటనే బదులిచ్చినట్లు తెలుస్తోంది.