సీఎం రేవంత్ రెడ్డి నేడు విద్యాశాఖ అధికారులతో భేటీ కానున్నారు. శుక్రవారం ఉదయం 10.30కు బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ భేటీ జరగనుంది. ఇందులో ప్రధానంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై చర్చించనున్నారు. పరీక్షల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేలా అధికారులకు విలువైన సూచనలు,సలహాలు ఇవ్వనున్నారు.
పేపర్ లీకేజీలు, గతంలో తలెత్తిన ఇబ్బందులు మరల పునరావృతం కాకుండా సీఎం రేవంత్ విద్యాశాఖ అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. విద్యాశాఖపై సమీక్ష అనంతరం అక్కడే 11.30కు టూరిజం శాఖ అధికారులతో సీఎం సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3.30కు గాంధీ భవన్‌లో టీపీసీసీ సమావేశంలో పాల్గొని అక్కడి నుంచి నేరుగా సాయంత్రం 5 గంటలకు జలవిహార్ ‘విజయ తెలంగాణ’పుస్తక ఆవిష్కరణ ఈవెంట్‌లో పాల్గొనున్నారు.