మోసం అనేది మోసమే.. క్రికెట్ ఆస్ట్రేలియా‌పై ఇయాన్ చాపెల్ మండిపాటు

-

వచ్చే నెల 8 నుంచి గబ్బా వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ ప్రారంభంకానున్నది. ఇప్పటికే జట్టును ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. అయితే, ఈ నిర్ణయాన్ని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఇయాన్ చాపెల్ తీవ్రంగా తప్పు పట్టారు.

నేనే కనుక ఆస్ట్రేలియా క్యాప్టెన్‌గా మోసం చేసి ఉంటే, క్రికెట్ ఆస్ట్రేలియా నన్ను ఉద్యోగంలో నుంచి తొలగించేది. క్రికెట్ కూడా ఆడనిచ్చే వారు కాదు అని విమర్శించారు.

ఇయాన్ చాపెల్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా అందరి దృష్టి 2018లో కేప్ టౌన్ వేదికగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మ్యాచ్‌‌ సందర్భంగా జరిగిన బాల్ టాంపరింగ్ వ్యవహారంపై మళ్లింది.

బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన అప్పటి ఆస్ట్రేలియా క్యాప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, జట్టు సభ్యుడు కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌ల నిషేధం విధించింది. ఇది ‘సాండ్‌పేపర్ గేట్ ఉదాంతంగా పేరుగాంచింది.

స్టీవ్ స్మిత్‌పై క్రికెట్ ఆడకుండా ఏడాది నిషేధంతోపాటు రెండేండ్ల క్యాప్టెన్సీ చేయకుండా బ్యాన్ పెట్టారు.

వైస్ క్యాప్టెన్ డేవిడ్ వార్నర్‌పై ఏడాది నిషేధం విధించడంతోపాటు జట్టుకు నాయకత్వం వహించకుండా జీవితకాలం బ్యాన్ పెట్టారు.

అయితే, యాషస్ సిరీస్‌కు స్టీవ్ స్మిత్‌ను వైస్ క్యాప్టెన్‌గా నియమించడం ఇయాన్ చాపెల్ మండిపడ్డారు. ‘క్లీన్ క్రికెట్’ సిద్ధాంతాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా బ్రేక్ చేసిందని ఆరోపించారు.

ఇక్కడే నాకో సమస్య ఉంది. డేవిడ్ వార్నర్‌‌కు స్టీవ్ స్మిత్‌కూ ఎందుకు వేర్వేరు శిక్షలు విధించారు. వాస్తవానికి స్మిత్ చేసిన నేరమే పెద్దది అన్నారు. మోసం అనేది మోసమే. అందులో చిన్న మోసం, పెద్ద మోసం అంటూ ఉండదు. నా దృష్టిలో ఇప్పటికీ అది మోసమే అని ఇయాన్ చాపెల్ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version