56వ సారి బదిలీ అయిన ఐఏఎస్‌ అధికారి.. అదే కారణమా..?

-

ఇప్పటి 55 సార్లు బదిలీ అయి ఎక్కువ సార్లు బదిలీ అయ్యే ఐఏఎస్‌ అధికారిగా పేరుగాంచారు అశోక్‌ ఖేమ్కా. తాజాగా ఇప్పుడు ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం హరియాణా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖకు అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనను అదే హోదాతో ప్రభుత్వ ప్రాచీన పత్ర భాండాగార (ఆర్కైవ్స్‌) శాఖకు బదిలీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.

30 ఏళ్ల కెరీర్‌లో ఖేమ్కాకు ఇది 56వ బదిలీ. ఉత్తర్వుల్లో పేర్కొనకపోయినా కొన్ని రోజుల క్రితం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)కి రాసిన లేఖ దీనికి కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న శాఖను ఉన్నతవిద్యా శాఖలో విలీనం చేయడంతో పని లేకుండా పోయిందని ఖేమ్కా ఆ లేఖలో పేర్కొన్నారు. తన స్థాయి అధికారికి వారానికి కనీసం 40 గంటల పని ఉండాలని సీఎస్‌కు సూచించారు. తన కెరీర్‌లో ఎక్కువ సార్లు అప్రాధాన్య పోస్టుల్లోనే కొనసాగిన ఖేమ్కా ఆర్కైవ్స్‌ శాఖలో పనిచేయడం ఇది నాలుగోసారి.

Read more RELATED
Recommended to you

Exit mobile version