లాక్ డౌన్.. 2 నెలల పాటు ఆ నాలుగు చానళ్ళు ఉచితం

-

న్యూఢిల్లీ : లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన చాలా మంది టీవీ వీక్షకులను ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్(ఐబీఎఫ్) శుభవార్త చెప్పింది. దేశంలోని ప్రముఖ బ్రాడ్‌కాస్టింగ్ నెట్‌వర్క్‌లు వాటి పరిధిలోని నాలుగు చానళ్లను ఉచితంగా అందివ్వనున్నట్టు ఐబీఎఫ్ తెలిపింది. ఆ చానళ్ళపై అన్ని రకాల టారీఫ్, చార్జీలను తొలగిస్తున్నట్టు ఆయా నెట్‌వర్క్‌లు పేర్కొన్నాయి.

అందులో సోని పాల్, స్టార్ ఉత్సవ్, జీ అన్మోల్, కలర్స్ రిష్టే చానల్స్ ఉన్నాయి. ఈ చానళ్లు రెండు నెలలపాటు ఉచితంగా అందుబాటులో ఉంటాయని ఐబీఎఫ్ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న డీటీహెచ్, కేబుల్ నెట్‌వర్క్‌లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. కరోనా వ్యాప్తి నిరోధానికి వ్యతిరేకంగా కేంద్రం చేస్తున్న పోరాటానికి ఐబీఎఫ్ మద్దతుగా నిలబడుతుందని చెప్పింది.

కరోనా కారణంగా టీవీ పరిశ్రమ దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటుందని.. ఇది ప్రకటనల మీద తీవ్ర ప్రభావం చూపుతోందని ఐబీఎఫ్ తెలిపింది. అయినా ఇలాంటి కష్ట సమయాల్లో కేంద్రం తీసుకుంటున్న చర్యలకు సాకారం ఉంటుందని వెల్లడించింది. లాక్ డౌన్ వేళ ఇళ్లకే పరిమితమైన టీవీ వీక్షకులకు ఉచితంగా వినోదం అందించడం వారికి కొంతమేర రిలీఫ్ కలిగిస్తోందని భావిస్తున్నట్టు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version