బ్యాంకుల్లో 1557 క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ !

-

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి ఐబీపీస్ ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులను కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ (సీఆర్పీ)-X ద్వారా భర్తీ చేస్తారు.


వివరాలు:
ఈ సీఆర్పీ పరీక్ష ద్వారా ఖాళీలను కింది ఈ బ్యాంకులలో పోస్టులను భర్తీ చేస్తారు… బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరాబ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

పోస్టు పేరు : క్లరికల్ కేడర్
మొత్తం ఖాళీలు: 1557 (తెలంగాణ-20, ఏపీ-10)
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయస్సు: 2020, సెప్టెంబర్ 1 నాటికి 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా చేస్తారు.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి: ఆన్లైన్లో
దరఖాస్తు దాఖలు చేసుకోవడానికి చివరితేదీ: 2020 సెప్టెంబర్ 23
ప్రిలిమినరీ పరీక్షతేదీ: 2020 డిసెంబరు 5,12,13.
మెయిన్ పరీక్షతేదీ: 2021, జనవరి 24
తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్
ఏపీలో పరీక్ష కేంద్రాలు: చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
పూర్తి వివరాల కోసం వెబ్సైట్: https://www.ibps.in 

Read more RELATED
Recommended to you

Exit mobile version