ICC :క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ప్యాట్ కమిన్స్

-

ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2023గా ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఎంపికయ్యారు. కమిన్స్ ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ,భారత ద్వయం విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలను అధిగమించి ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు.గతేడాది అన్ని ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన చేయడంతో అతడికి ఈ అవార్డు దక్కింది.

 

స్ఫూర్తిదాయకమైన కెప్టెన్ గా బ్యాట్ మరియు బాల్‌తో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో విజయం, యాషెస్‌ను నిలబెట్టుకోవడం మరియు ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023లో రికార్డు ఆరవ విజయం సాధించి జట్టు ప్రశంసలను పొందాడు.ODIలలో, అతను అనేక కీలకమైన నాక్‌లను ఆడాడు.అదే సమయంలో అతను బౌలింగ్ లో కూడా కీలకమైన పురోగతిని సాధించాడు.

టెస్ట్ క్రికెట్‌లో కమిన్స్ రెండు సార్లు 10 వికెట్ల హాల్‌తో అద్భుతముగా రాణించాడు.మరోవైపు ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడిగా ఆయన చరిత్ర సృష్టించారు. రూ.20.25 కోట్లు వెచ్చించి సన్రైజర్స్ హైదరాబాద్ కమిన్ను దక్కించుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version