రాష్ట్రంలో ప్రతిపక్షాలకు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇన్నాళ్లు సహనంగా ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సహనాన్ని చేతగానితనంగా తీసుకుంటే తామేంటో చూపిస్తామని సీరియస్ కామెంట్స్ చేశారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో కేటీఆర్ తెలుసుకోవాలని హితవు పలికారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే లోక్ సభ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయన్నారు.
గురువారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ లీడర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కసారి కన్నెర్ర చేస్తే.. బీఆర్ఎస్ పార్టీ మిగలదు అని భట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని.. బూత్ ఏజెంట్లు అత్యంత కీలకంగా పనిచేయాలని సలహా ఇచ్చారు.