ఐసీసీ కొత్త నిబంధ‌న‌లు.. టీ 20 స్లో ఓవ‌ర్ రేట్ భారీ మార్పు

-

క్రికెట‌ర్లకు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. అంత‌ర్జాతీయ‌ టీ 20 మ్యాచ్ లలో స్లో ఓవ‌ర్ రేట్ న‌మోదు అనేది ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ సార్లు న‌మోదు అవుతుంది. దీంతో స్లో ఓవ‌ర్ రేటును అరిక‌ట్ట‌డానికి ఐసీసీ క‌ఠిన నిబంధ‌న‌లు తీసుకువ‌చ్చింది. ప్ర‌స్తుతం టీ 20 మ్యాచ్ ల‌లో స్లో ఓవ‌ర్ రేటు న‌మోదు అయితే మ్యాచ్ ముగిసిన త‌ర్వాత ఫీజులో కోత విధిస్తుంది. అయినా స్లో ఓవ‌ర్ రేటు త‌గ్గ‌క పోవ‌డంతో దీని తో పాటు మ‌రో క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యం ప్ర‌కారం స్లో ఓవ‌ర్ రేటు న‌మోదు అయితే.. 30 గ‌జాల స‌ర్కిల్ లోప‌ల ఉండే నిర్ధేశించిన ఫీల్డ‌ర్ల క‌న్నా.. ఒక ఫీల్డ‌ర్ ను తొల‌గిస్తారు.

అంటే మ్యాచ్ లో ఒక ఫీల్డ‌ర్ సేవ‌ల‌ను కొంత వ‌ర‌కు న‌ష్ట పోవాల్సి వ‌స్తుంది. దీంతో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు కు ఎక్కువ ప‌రుగులు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. కాగ ఈ నిబంధ‌న ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచే ప్రారంభం అవుతాయ‌ని ఐసీసీ తెలిపింది. కాగ ఈ నిబంధ‌న‌ల‌ను ఇటీవ‌ల ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న హండ్రెడ్ లీగ్ అమలు చేశారు. దీంతో పూర్తి గా అమ‌లు చేయాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే జ‌న‌వ‌రి 16 నుంచి వెస్టిండీస్ – ఐర్లాండ్ మ‌ధ్య జ‌ర‌గ‌బోయే టీ 20 మ్యాచ్ లో అంత‌ర్జాతీయంగా మొద‌టి సారి ఈ నిబంధ‌న‌లను అమ‌లు చేయ‌నున్నారు. కాగ భార‌త్ – వెస్టిండీస్ మ‌ధ్య త్వ‌ర‌లోనే టీ20 సిరీస్ ఉంది. ఈ సిరీస్ లో భార‌త్ ఈ నిబంధ‌న‌ల‌ను ఎదుర్కొనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version