ఉద్యోగులకు కేసీఆర్ గుడ్ న్యూస్..నేడు జోనల్​, బహుళ జోనల్​ అధికారుల బదిలీలు

-

రాష్ట్రపతి నూతన ఉత్తర్వులకు అనుగుణంగా కొత్త జోనల్‌ విధానం కింద చేపట్టిన ఉద్యోగుల బదలాయింపుల ప్రక్రియలో భాగంగా జిల్లా స్థాయిలలో బదిలీలు, నియామకాలు పూర్తయ్యాయి. జోనల్‌, బహుళ జోనల్ ఉద్యోగులు, అధికారుల బదిలీలు, నియామకాలు ఇవాళ పూర్తి కానున్నట్లు సీఎస్ సోమేశ్ కుమార్ ప్రకటన చేశారు. 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లా క్యాడర్ ఉద్యోగుల పోస్టింగ్స్ పూర్తి అయిందని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.

kcr

22 వేల 418 మంది టీచర్ లకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తే 21 వేల 800 మంది తమ కొత్త పోస్టుల్లో రిపోర్ట్ చేశారని… మిగిలిన వారు కూడా ఈ రోజు రిపోర్ట్ చేస్తారన్నారు. 13 వేల 760 మంది జిల్లా క్యాడర్ ఉద్యోగులు కొత్త పోస్టుల్లో జాయిన్ అయ్యారని.. జోనల్ మల్టీ జోనల్ ఉద్యోగుల పోస్టింగ్స్ రేపటి వరకు పూర్తి అవుతాయని చెప్పారు. ఇంత తక్కువ సమయం లో ఉద్యోగ,ఉపాధ్యాయుల కేటాయింపు పూర్తి చేయడం గొప్ప విజయమని… పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేసినందుకు కలెక్టర్ లకు, విభాగా అధిపతులకు కృతజ్ఞతలు తెలిపారు సీఎస్ సోమేశ్ కుమార్. ఈ విషయంపై సీఎం కేసీఆర్ కు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సీఎస్ సోమేశ్ కుమార్.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version