ఐసీఐసీఐ ఫెస్టివ్ బొనాంజా ఆఫ‌ర్.. త‌క్కువ ఈఎంఐలతో లోన్లు..!

-

ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ ఐసీఐసీఐ రానున్న ద‌స‌రా దీపావ‌ళి పండుగ‌ల నేప‌థ్యంలో క‌స్ట‌మ‌ర్లకు ఫెస్టివ్ బొనాంజా ఆఫ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫ‌ర్ కింద అన్ని ర‌కాల లోన్ల‌ను త‌క్కువ ఈఎంఐల‌కే తీసుకోవ‌చ్చు. అలాగే ఫ్లాట్ ప్రాసెసింగ్ చార్జిల‌ను వ‌సూలు చేస్తున్నారు. అందువ‌ల్ల త‌క్కువ చార్జిల‌కే లోన్ల‌ను తీసుకోవ‌చ్చు.

కార్ లోన్ల‌పై ఐసీఐసీఐ బ్యాంక్ ఫ్లాట్ రూ.1,999 ప్రాసెసింగ్ ఫీజ్ ఆఫ‌ర్‌ను అందిస్తోంది. అలాగే రూ.1 ల‌క్ష‌కు నెల‌కు రూ.1554 మాత్ర‌మే ఈఎంఐ చెల్లించేలా కార్ లోన్ తీసుకోవ‌చ్చు. కాల ప‌రిమితి 84 నెల‌లుగా ఉంది. టూవీలర్ లోన్ల‌కు రూ.1వేయి లోన్‌కు నెలకు రూ.36 ఈఎంఐ చెల్లించేలా లోన్ల‌ను ఇస్తోంది. ఈ లోన్ల‌కు గ‌రిష్ట కాల‌ప‌రిమితి 36 నెల‌లుగా అందిస్తున్నారు. ప్రాసెసింగ్ ఫీజును రూ.999గా నిర్ణ‌యించారు.

ఐసీఐసీఐ బ్యాంక్ క‌స్ట‌మ‌ర్లు ఇన్‌స్టంట్ ప‌ర్స‌న‌ల్ లోన్లు తీసుకోవ‌చ్చు. వ‌డ్డీ 10.50 శాతం అవుతుంది. ఫ్లాట్ ప్రాసెసింగ్ ఫీజు రూ.3,999ను అందిస్తున్నారు. డిజిట‌ల్ ప్రొడ‌క్ట్‌ల‌ను కొనుగోలు చేస్తే నో కాస్ట్ ఈఎంఐ కింద లోన్ సౌక‌ర్యం పొంద‌వ‌చ్చు. ఫెస్టివ్ బొనాంజాలో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ ప‌లు ఆఫ‌ర్ల‌ను, డిస్కౌంట్ల‌ను, క్యాష్ బ్యాక్‌ల‌ను అందిస్తోంది. బ్యాంక్‌కు చెందిన క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు, మొబైల్ బ్యాంకింగ్‌, నెట్ బ్యాంకింగ్ సౌక‌ర్యాల ద్వారా వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తే ఆ ఆఫర్ల‌ను పొంద‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version