ఈ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇక నుండి కొత్త సేవలు..!

-

మీకు ఐసీఐసీఐ బ్యాంక్ లో అకౌంట్ ఉందా..? అయితే మీకు గుడ్ న్యూస్. తాజాగా ప్రైవేట్ రంగ ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్‌ తో హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCL పార్ట్నర్ షిప్ ని కుదుర్చుకోవడం జరిగింది. దీనిలో భాగంగా కొత్త సేవలని ఇక నుండి ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్స్ పొందొచ్చు.

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. హెచ్‌పీసీఎల్ ఐసీఐసీఐ బ్యాంక్ ఒప్పందం లో భాగంగా బ్యాంక్ కస్టమర్లు ఇక పై ఫాస్టాగ్ ద్వారానే వారి వాహనాలకు పెట్రోల్, డీజిల్ కొట్టించుకో వచ్చు. వాహనాలకు పెట్రోల్, డీజిల్ ని కొట్టించుకునేటప్పుడు కార్డు ద్వారా పేమెంట్ ని కానీ క్యాష్ కానీ ఇవ్వాల్సిన పని లేదు. హెచ్‌పీసీఎల్ రిటైల్ ఔట్‌లెట్స్‌ లో ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది.

దీంతో ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు ఫ్యూయెల్, టోల్, పార్కింగ్ పేమెంట్లు అన్నింటినీ ఫాస్టాగ్ ద్వారానే చెల్లించొచ్చు. ఇది నిజంగా కస్టమర్స్ కి ఈజీగా ఉంటుంది. పైగా సమయాన్ని కూడా సేవ్ చేసుకోచ్చు. దేశంలో ఫాస్టాగ్ ద్వారా ఫ్యూయెల్ సేవలు అందిస్తున్న తొలి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీగా హెచ్‌పీసీఎల్ నిలిచింది. ఇది ఇలా ఉంటే ఐసీఐసీఐ బ్యాంక్ భాగస్వామ్యం తో ఫాస్టాగ్ డిజిటల్ చెల్లింపులు మరింత పెరుగుతాయని హెచ్‌పీసీఎల్ తెలిపింది. దీని వలన ప్రభుత్వపు డిజిటల్ ఇండియా కార్యక్రమం మరింత సక్సెస్ అవ్వడంతో పాటు కస్టమర్లకు కూడా ప్రయోజనం ఉంటుందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version