ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన పుష్ప-2 మూవీకి ఊహించని విధంగా రెస్పాన్స్ వస్తోంది. తొలుత మూవీకి డివైట్ టాక్ వచ్చింది. కానీ, ఉత్తర భారతంలో మాత్రం పుష్ప-2 మూవీకి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప-2 కు వచ్చిన రెస్పాన్స్ కంటే అటు నార్త్ ఇండియాలోనే మూవీకి అత్యధికంగా కలెక్షన్లు వస్తున్నట్లు సమాచారం.
తాజాగా పుష్ప-2 సినిమా రూ.1000 కోట్ల క్లబ్‌లోకి చేరినట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ తెగ సంబురాలు చేసుకుంటున్నారు. ఏపీలోని పాలకొల్లులో బన్నీ ఫ్యాన్స్ కేక్ కట్ చేసి మరీ ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
👉రూ.1000 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ ‘పుష్ప 2’.
👉పాలకొల్లులో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబరాలు pic.twitter.com/sY8NMF2PVJ— ChotaNews (@ChotaNewsTelugu) December 13, 2024