విజయ్ దేవరకొండ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. సక్సెస్ లపై సక్సెలు కొట్టుంకుంటూ మందుకెళ్తున్నాడు. టైమ్ కూడా అలాగే కలిసొచ్చింది. ప్రస్తుతం నటిస్తోన్న డియర్ కామ్రేడ్ పై భారీ అంచనాలున్నాయి. రష్మిక-విజయ్ ల మధ్య ఘాటైన రొమాన్స్ ఈ అంచనాలకు మెయిన్ రీజన్. టీజర్, ట్రైలర్ తో విజయ్ పాత్ర కూడా కొత్తగా ఉండేలా అనిపిస్తోంది. మరి కామ్రడ్ కొడతాడా? లేదా? అన్నది తర్వాత చూద్దాం. ప్రస్తుతం విజయ్ క్రాంతి మధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీన్ని కె.ఎస్ రామారావు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మరోవైపు ఓ కొత్త డైరెక్టర్ తో సినిమాచేస్తున్నట్లు ఇటీవల ప్రకటించాడు. అలాగే మరో రెండు కథలకు ఒకే చెప్పాడు.
ఆ దర్శకుల వివరాలు రివీల్ చేయలేదు గానీ, కథలు మాత్రం లాక్ చేసాడు. క్రాంతి మాధవ్ సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్ కు వెళ్లనుంది. అయితే తాజాగా విజయ్ ఒకే చేసిన రెండు కథల్లో ఒక కథ ఇడియట్ -2లా ఉంటుందని కొన్ని సోర్సెస్ ద్వారా తెలిసింది. అందులో విజయ్ పాత్ర చలాకీగా ఉంటుందిట. నేటి తరం యువత స్పీడ్ కు ఆ కథ అద్దం పడుతుందని తెలిసింది. పాత్ర పూర్తిగా కమర్శిలైజ్డ్ గా ఉంటుందిట. ఒక హాస్టల్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందిట. ఈ చిత్రానికి దర్శకత్వం వహించేది వైజాగ్ కి చెందిన కుర్రాడుట. డ్యాషింగ్ డైరెక్టర పూర్తి జగన్నాథ్ అసిస్టెంట్ అని సమాచారం. దాదాపు 10 సినిమాలకు ఆయన వద్ద అసిస్టెంట్ గా చేసాడుట.
ఆ అనుభవంతోనే పూరి కాంపౌండ్ వదిలి సొంత ప్రయత్నాల్లో భాగంగా విజయ్ తారసపడినట్లు సమాచారం. ఇక పూరి అసిస్టెంట్ అంటే చెప్పాల్సిన పనిలేదు. అతని వద్ద పనిచేసే కుర్రాళ్లందరిలోనే మ్యాటర్ ఉంటుంది. ఆషామాషీ ట్యాలెంట్ ను పూరి ఎంకరేజ్ చేయడు. అతని వద్ద పనిచేయాలంటే ముందు కొన్ని పరీక్షలు పాస్ అవ్వాలి. అప్పుడే పూరి వద్ద ఛాన్స్ ఉంటుంది. వ్యక్తిగతంగా పూరితోనే ఆ కుర్రాడికి మంచి అనుబంధం ఉందని సమాచారం. ఈ కథను ముందుగా పూరికి వినిపించాడుట. ఆయన కూడా మెచ్చారుట. ఆ తర్వాతే విజయ్ వద్దకు వెళ్లినట్లు చెబుతున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏంటన్నది తేలాల్సి ఉంది.