ఆర్ ఎక్స్ బ్యూటీ పాయ‌ల్ రాజ్ పుత్ ల‌వ‌ర్ ఇత‌నేనా?

-

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో ముంబై బ్యూటీ పాయ‌ల్ రాజ్ పుత్ టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందో. తొలి సినిమాలోనే ఘాటుగా న‌టించి కుర్రాళ్ల‌ను ఫిదా చేసింది. అందం, అభిన‌యంతో క‌ల‌ల రాణి అయిపోయింది. అంతేనా వ‌రుస‌గా స్టార్ హీరోల సినిమాల్లో నాయిక అయింది. ద‌ర్శ‌క‌, నిర్మాత‌లంతా అమ్మ‌డి వెంటే ప‌డుతున్నారు. మ‌రి ఈ క్రేజీ భామ ఎఫైర్ న‌డిపితే ఎలా ఉంటుంది? ఎవ‌రో ఆ ల‌క్కీ గ‌య్ అని కామెంట్లు స‌హ‌జం. ఇప్పుడ‌దే జ‌రుగుతోంది. పాయ‌ల్ ఇన్ స్టా గ్రామ్ లో ఓ వ్య‌క్తితో క‌లిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. ఆ పిక్ కి మూడు ప్రేమ గుర్తుల‌ను జోడించింది. ఈ జంట‌ను చూసిన మ‌రో న‌టి, పాయ‌ల్ స్నేహితురాలు అర్చ‌నా గుప్తా మై ఫెవ‌రెట్ ల‌వ్ బ‌ర్స్ట్ అని కామెంట్ పెట్టింది.

Payal Rajput shares her boyfriend photo

దీంతో పాయ‌ల్ ప్రియుడు ఇత‌నేనంటూ కామెంట్ చేసింది. దానికి బ‌ధులు పాయ‌ల్ ల‌వ్ సింబ‌ల్స్ పెట్టింది. దీంతో విష‌యం క‌న్ప‌మ్ అయింది. పాయ‌ల్పై సోష‌ల్ మీడియా లో ర‌చ్చ వేడెక్కింది. పాయ‌ల్ ప్రేమికుడు వెనుక నుంచి బాగున్నాడు..ముందు నుంచి ఎలా ఉన్నాడో అంటూ కామెంట్లు మొద‌లయ్యాయి. పాయ‌ల్ ఆ వ్య‌క్తి ఫోట‌ను వెనుక నుంచి పోస్ట్ చేసింది. అత‌ని భుజాల‌పై వాలి సేద తీరుతోంది. తీక్ష‌ణంగా చూస్తూ దిగిన సెల్‌ఫీ ఇది. మ‌రి ఆవ్య‌క్తి పేరు..ఇత‌ర వివ‌రాలు ఎప్పుడు రివీల్ చేస్తుందో చూద్దాం. ఇప్ప‌టికే రేణుదేశాయ‌ల్ ఈ త‌ర‌హా గేమ్ ఆడుతోంది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచి విడిపోయిన త‌ర్వాత రెండ‌వ పెళ్లికి సిద్ద‌మైన సంగ‌తి తెలిసిందే. ఓ వ్యాపార‌వేత్త‌ని ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది. కానీ ఆ వ్య‌క్తి చేతులు ..కాళ్లు త‌ప్ప ఇంకేం లీక్ చేయ‌లేదు. ఇప్పుడు పాయ‌ల్ వ్వ‌హారం అలాగే క‌నిపిస్తుంది. మ‌రి ఈ స‌స్పెన్స్ ఎప్పుడు తెర దించుతుందో. ప్ర‌స్తుతం పాయ‌ల్ డిస్కోరాజా, వెంకీ మామ చిత్రాల్లో న‌టిస్తోంది. అలాగే ఆర్ డీఎక్స్ అనే మ‌రో సినిమాలు కూడా న‌టిస్తూ బిజీగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version